బైక్‌ను ఢీకొట్టిన కారు.. యువకుడు మృతి
● అతడి భార్య, కుమార్తెకు తీవ్ర గాయాలు
మంచాల, మర్రిగూడ: నాగార్జునసాగర్– హైదరాబాద్ రహదారిపై రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగాపల్లి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మర్రిగూడ మండలం యరగండ్లపల్లి గ్రామానికి చెందిన మైలారం జంగయ్య(27) మృతిచెందాడు. అతడి భార్య, కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జంగయ్య కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లో నివాసముంటూ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. జంగయ్యకు భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. వ్యక్తిగత పని నిమిత్తం భార్య పార్వతమ్మ, కుమార్తె అశ్వితతో కలిసి స్వగ్రామం యరగండ్లపల్లికి వచ్చిన జంగయ్య సోమవారం తిరిగి బైక్‌పై హైదరాబాద్ వెళ్తుండగా.. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగాపల్లి సమీపంలోని జేబీ వెంచర్ వద్ద వీరి బైక్‌ను ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జంగయ్య అక్కడికక్కడే మృతిచెందగా.. పార్వతమ్మ, అశ్వితకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. జంగయ్య మృతితో యరగండ్లపల్లి విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment