వారబందీ.. ఇబ్బంది
అర్వపల్లి: యాసంగి సీజన్‌కు గాను జిల్లాకు విడుదల చేస్తున్న గోదావరి జలాలకు సంబంధించి వారబందీ విధానం సక్రమంగా అమలు కాక రైతులు ఆందోళన చెందుతున్నారు. వారబందీ విధానంలో వారం రోజులకోసారి నీటిని జిల్లాకు వదులుతున్నారు. వారం తప్పి వారం నీటిని వదలాల్సి ఉంది. ఈ విధానంలో ఆదివారం గోదావరి జలాలను జిల్లాకు పునరుద్ధరించాల్సి ఉంది. కానీ రెండు రోజులవున్నా నీటిని పునరుద్ధరించలేదు. ఈ సీజన్‌లో ఇప్పటికే రెండోదశ పరిధిలోని పంటలు నీళ్లు చాలక ఎండిపోతున్నాయి. దీనికి తోడు వారబందీ విధానం అమలు షెడ్యూల్ ప్రకారం జరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారబందీ విధానంలో ఈ నెల 9వరకు నీటిని జిల్లాకు విడుదల చేయాల్సి ఉంది. ఈ విధానం మొదలై రెండు రోజులు గడుస్తున్నా అధికారులు నీటిని వదలలేదు. కరీంనగర్ జిల్లా లోయర్‌మానేరు డ్యాం నుంచి నీటిని రెండోదశకు విడుదల చేయకపోవడంతో ఇక్కడ నీటిని ఇవ్వలేకపోతున్నామని నీటి పారుదలశాఖ అధికారులు చెబుతున్నారు.
ఎండిపోతున్న పంటలు
జిల్లా వ్యాప్తంగా ఎస్సారెస్పీ రెండోదశ కింద 2.20లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టుకు 69, 70,71 డీబీఎంల ద్వారా నీళ్లు అందుతున్నాయి. అయితే ఈ సారి లక్ష్యానికి మించి రైతులు వరి సాగు చేశారు. పై నుంచి నీళ్లు తక్కువగా వస్తుండటం, వరి సాగు పెరగడానికి తోడు గతనెల నుంచి ఎండలు మండిపోతున్నాయి. దీంతో నీళ్లు ఎక్కడికక్కడ ఆవిరై చివరి భూములకు వెళ్లని పరిస్థితి నెలకొంది. దీంతో వరి పొలాలు ఎండిపోతుండటంతో రైతులు ఎక్కడికక్కడ గ్రామాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికై నా నీటిపారుదలశాఖ అధికారులు జోక్యం చేసుకొని గోదావరి జలాలను పునరుద్ధరించి వారబందీ విధానానికి స్వస్తి పలికి పంటలు చేతికొచ్చే వరకు నిరంతరాయంగా నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఫ సరిగా అమలుకాని వారబందీ విధానం
ఫ షెడ్యూల్ ప్రకారం రెం డురోజులైనా రాని గోదావరి జలాలు
ఫ ఎండిపోతున్న పంటలు
ఎనిమిది ఎకరాల పంట ఎండిపోయింది
యాసంగిలో 8ఎకరాల వరి సాగు చేశాను. దీని కోసం రూ.3లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. వారబందీ విధానంలో నీళ్లు సరిగా రాక పంట ఎండిపోతోంది. పెట్టుబడి కూడా వెళ్లేలా లేదు. అప్పులపాలయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికై నా నిరంతరాయంగా నీటిని వదిలితే పంట చేతికి వస్తుంది. –బచ్చు శ్రీనివాస్,
నర్సింహులగూడెం, నాగారం మండలం
వారబందీ.. ఇబ్బంది
వారబందీ.. ఇబ్బంది
Comments
Please login to add a commentAdd a comment