భానుపురి (సూర్యాపేట) : ఇంటర్మీడియట్ పరీక్షలను జిల్లావ్యాప్తంగా పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్ నుంచి అదనపు కలెక్టర్ పి.రాంబాబుతో కలిసి వెబెక్స్ ద్వారా ఇంటర్మీడియట్ పరీక్షలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు ఉదయం 7.30గంటల కల్లా పరీక్ష కేంద్రాలకు రావాలని, ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించకూడదని సూచించారు. సమావేశంలో ఇంటర్మీడియట్ అధికారి బాలునాయక్, డీఎంహెచ్‌ఓ కోటాచలం, విద్యుత్ శాఖ అధికారులు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment