ముఖం చూపిస్తేనే సరుకులు
అంగన్‌వాడీల్లో సరుకులు పక్కదారి పట్టకుండా కొత్తవిధానం
పారదర్శకత కోసమే
అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎఫ్‌ఆర్‌ఎస్‌తో లబ్ధిదారులకు పారదర్శంగా సరుకులు అందుతాయి. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం ద్వారా 7నెలల నుంచి 3ఏళ్లలోపు చిన్నారులకు అందిస్తున్న టేక్ హోమ్ రేషన్‌ను నిర్ధారణ పూర్వకంగా లబ్ధిదారులకు అందుతుంది. ప్రతి నెలా లబ్ధిదారులకు అందజేసే సరుకులను ఎఫ్‌ఆర్‌ఎస్‌లో నమోదు చేస్తాం. దీని ద్వారా పారదర్శకంగా సరుకులు అందటంతో పాటు, ఇతరులు సరుకులు తీసుకోవడానికి అవకాశం ఉండదు.
– నర్సింహారావు,
జిల్లా సంక్షేమ అధికారి, సూర్యాపేట.
నాగారం : అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే లబ్ధిదారులకు పారదర్శకంగా సరుకులు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం (ఎఫ్‌ఆర్‌ఎస్ ) తీసుకొచ్చింది. గతంలో అంగన్‌వాడీ లబ్ధిదారులకు అందించే సరుకుల విషయంలో జాబితాలో పేర్లు ఒకరివి ఉంటే మరొకరికి ఇస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో కొత్తవిధానం అమలు చేయాలని నిర్ణయించింది. ఇకపై లబ్ధిదారుడి ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం (ఎఫ్‌ఆర్‌ఎస్) హాజరు ఆధారంగా సరకులు ఇవ్వనున్నారు. ఈ మేరకు చిన్నారులు లేదా తల్లి ఫొటోలతో పాటు ఆధార్ వివరాలు పోర్టల్‌లో నిక్షిప్తం చేస్తున్నారు.
వివరాల నమోదు..
అంగన్‌వాడీ కేంద్రాల్లో బాలింతలకు, గర్భిణులు, చిన్నారులకు ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నారు. ఏడు నెలల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు బాలామృతం, గుడ్లు అందిస్తారు. రెండున్నర కిలోల బాలామృతం, 16 గుడ్లు, అతి తీవ్ర పోషణ లోపం ఉన్న చిన్నారులకు నెలకు 30 గుడ్లు, బాలామృతం అదనంగా ఒక ప్యాకెట్‌ను రెండు విడతల్లో అందిస్తారు. సరుకులు అసలైన లబ్ధిదారుడికి అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎన్‌ఎస్‌టీఎస్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. చిన్నారి లేదా తల్లి ఫొటో తీస్తారు. ఆధార్ కార్డులో ఉన్న వివరాలను పొందుపరుస్తున్నారు. ఈ ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా గత నెల 10వ తేదీన ప్రారంభమైంది. ప్రస్తుతం జిల్లాలో మూడేళ్లలోపు చిన్నారులు 25,139 ఉండగా వీరిలో ఇప్పటి వరకు 11,569 మంది చిన్నారుల ఫొటోలను యాప్‌లో నమోదు చేశారు. ఈ ప్రక్రియ వంద శాతం పూర్తికాగానే ప్రతి నెలా పోర్టల్లో ఫొటో తీసి సరకులు ఇవ్వనున్నారు. ప్రస్తుతం గర్భిణులు, బాలింతలు, చిన్నారులు కేంద్రాల్లో భోజనం చేసే సమయంలో సిబ్బంది ఫొటోలు తీసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు.
ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం ద్వారా పంపిణీ
ఫ చిన్నారి లేదా తల్లి ఫొటోతో పాటు ఆధార్ వివరాలు పోర్టల్‌లో నిక్షిప్తం
ఫ ఇప్పటి వరకు జిల్లాలో45శాతం ప్రక్రియ పూర్తి
ఐసీడీఎస్ ప్రాజెక్టులు 05
అంగన్‌వాడీ కేంద్రాలు 1206
మూడేళ్లలోపు చిన్నారులు 25,139
3 నుంచి 6 ఏళ్లలోపు వారు 14,819
ముఖం చూపిస్తేనే సరుకులు
Comments
Please login to add a commentAdd a comment