ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి
సూర్యాపేటటౌన్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ అధికారులు సెంటర్లలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 22తో పరీక్షలు ముగియనున్నాయి. ఈ సారి నిర్దేశిత పరీక్ష సమయానికి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను అనుమతించనున్నారు.
జిల్లాలో 32 పరీక్ష కేంద్రాలు
జిల్లాలో మొత్తం 32 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 12 ప్రభుత్వ కళాశాలల్లో , 20 ప్రైవేటు కళాశాలల్లో ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 16,948 మంది పరీక్షలు రాయనున్నారు. వీరిలో జనరల్ ఫస్ట్ ఇయర్‌లో 6,688 మంది, జనరల్ సెకండియర్‌లో 6,666 మంది, ఒకేషనల్ ఫస్ట్ ఇయర్‌లో 1,952, ఒకేషనల్ సెకండ్ ఇయర్‌లో 1,642 మంది విద్యార్థులు ఉన్నారు.
పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు
ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, రెండు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు, 32 మంది చీఫ్ సూపరింటెండెంట్స్, 32 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులతో పాటు 850 మంది ఇన్విజిలేటర్లను నియమించారు.
పరీక్ష కేంద్రాల వద్ద
బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 163 అమలు
ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్ష కేంద్రాల వద్ద బీఎన్‌ఎస్‌ఎస్(భారతీయ నాగరిక్ సురక్ష సంహిత) సెక్షన్ 163 అమలులో ఉంటుందని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్స్, ఇంటర్ నెట్ సెంటర్స్, చుట్టుపక్కల లౌడ్ స్పీకర్లు మూసి వేయాలని సూచించారు.
నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు
ఫ సీసీ కెమెరాల నిఘాలో నిర్వహణ
ఫ పరీక్ష రాయనున్న ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 16,948 మంది
ఫ పరీక్ష కేంద్రాల వద్ద బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 163 అమలు
పరీక్షకు హాజరయ్యే
విద్యార్థులు ఇలా..
ఫస్టియర్ 8,640
సెకండియర్ 8,308
మొత్తం 16,948
పరీక్ష కేంద్రాలు 32
ప్రశాంతమైన వాతావరణలో పరీక్షలు రాసుకోవాలి
విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసుకోవాలి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సెంటర్లలో ఏర్పాట్లు చేశాం. విద్యార్థులు హడావుడిగా రాకుండా గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
– భానునాయక్, డీఐఈఓ
Comments
Please login to add a commentAdd a comment