నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి
చివ్వెంల(సూర్యాపేట) : విద్యార్థులు ప్రణాళికతో చదివి నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. మంగళవారం చివ్వెంల మండలంఐలాపురం గ్రామ శివారులో గల గిరిజన బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించారు. విద్యార్థులను మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు భయాందోళనకు గురికాకుండా బాగా రాయాలని సూచించారు. పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించి, మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని ఆదేశించారు. ఆయన వెంట పాఠశాల ప్రిన్సిపల్ దుర్గభవాని, వైస్ ప్రిన్సిపల్ షబానా, వార్డెన్ లలిత తదితరులు పాల్గొన్నారు.
వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి
గ్రామాల్లో వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. మంగళవారం చివ్వెంల మండల పరిధిలోని బి.చందుపట్ల గ్రామంలోని మిషన్ భగీరథ వాటర్ గ్రిడ్‌ను తనిఖీ చేశారు. నీటి సరఫరా వివరాలను ఈఈ కరుణాకర్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. 18 ఎంఎల్‌డీ(మిలియన్ లీటర్ డిమాండ్) సామర్థ్యం కలిగిన నీటి శుద్ధి కేంద్రం ద్వారా ఆత్మకూర్(ఎస్) మండలంలో 58 ఆవాసాలకు, చివ్వెంల మండలంలో 68 ఆవాసాలకు, మోతె మండలంలో 4 ఆవాసాలకు నీటి సరఫరా జరుగుతున్నట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో తాగునీటి ఇబ్బందులు కలగవద్దని, ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఇంట్రా ఈఈ శ్రీనివాస్‌రావు, డీపీఓ నారయణ రెడ్డి, డీఈ రాజేందర్, డీఈ పాండు తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్
Comments
Please login to add a commentAdd a comment