20 కిలో మీటర్ల పరిధిలో టోల్ రద్దు చేయాలి
నేరేడుచర్ల: జడ్చర్ల–కోదాడ జాతీయ రహదారిపై ఇటీవల ఏర్పాటు చేసిన టోల్ గేటు రుసుము వసూళ్లు 20 కి లో మీటర్ల మేరకు రద్దు చేయాలని తెలంగాణ మట్టిమనిషి వేనేపల్లి పాండురంగారావు కోరారు. మంగళవారం నేరేడుచర్లలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగులేన్ల పేరుతో ఽఅధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కానీ ఈ జాతీయ రహదారి నాలుగులేన్ల పనులు ఇంకా పూర్తికాలేదన్నారు. 20 కిలో మీటర్ల పరిధిలో టోల్ యాజమాన్యం ఉచితంగా ఇవ్వకుండా దోపిడీకి తెగబడ్డారని ఆరోపించారు. ఈ రహదారి నిర్మాణ పనులను పూర్తి చేసి జాతీకి అంతం చేసిన తరువాతనే టోల్ వసూలు చేయాల్సి ఉండగా పనులు పూర్తి కాకుండా వసూళ్లకు తెగబడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ టోల్ వసూళ్లపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ నుంచి కోదాడ వరకు అనేక సమస్యలు రహదారి వెంట ఉన్నాయని, వీటిని ఉమ్మడి జిల్లా ఇద్దరు మంత్రులు ఉత్తమ్‌కుమారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కోదాడ, సూర్యాపేట, నకిరేకల్ ఎమ్మెల్యేలు నలమాద పద్మావతి, జగదీష్‌రెడ్డి, వేముల వీరేశంలు అఖిల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక ప్రణాళికను రూపొందించాలన్నారు. ఆయన వెంట చవ్వ బుచ్చిరెడ్డి, కొత్తూరు అమృత, లోడంగి లింగయ్య తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment