బస్సులో పోగొట్టుకున్న పర్సు అప్పగింత
దేవరకొండ: ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు పోగొట్టుకున్న పర్సును డ్రైవర్, కండక్టర్ గుర్తించి తిరిగి అతడికి అప్పగించారు. దేవరకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బుధవారం హైదరాబాద్ నుంచి దేవరకొండకు వస్తుంది. ఈ బస్సులోని ప్రయాణికుడు ఒకరు పర్సు బస్సులోనే మర్చిపోయి కొండమల్లేపల్లిలో దిగిపోయాడు. బస్సులో పర్సును గుర్తించిన కండక్టర్ బుచ్చిరెడ్డి, డ్రైవర్ భోజ్య దేవరకొండ డిపో అధికారులకు అందజేశారు. పర్సులోని వివరాల ఆధారంగా పర్సు పోగొట్టుకున్న ప్రయాణికుడిని గుర్తించి అతడికి తిరిగి పర్సు అప్పగించారు. ఆ పర్సులో రూ.14,500 నగదు ఉన్నట్లు తెలిపారు. నిజాయితీ చాటుకున్న బస్సు డ్రైవర్, కండక్టర్‌ను ఆరీస్టీ అధికారులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment