గోదావరి జలాలు పెంపు
అర్వపల్లి: జిల్లాకు ఎస్సారెస్పీ రెండో దశకు గోదావరి జలాలను గురువారం 1700 క్యూసెక్కులకు పెంచినట్లు నీటి పారుదల శాఖ బయ్యన్నవాగు డీఈఈ ఎం. సత్యనారాయణ తెలిపారు. ఇందులో 69,70,71 డీబీఎంలకు గోదావరి జలాలను వదులుతున్నట్లు చెప్పారు.
అర్హులకు పనులు కల్పించాలి
నడిగూడెం : అర్హులైన కూలీలందరికీ ఉపాధి పనులు కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అధికారులను ఆదేశించారు. గురువారం నడిగూడెం మండల పరిధిలోని బృందావనపురం – మునగాల మండలం కలకోవ గ్రామాల కొనసాగుతున్న లింక్ రోడ్డు పనులను ఆయన పరిశీలించిన అనంతరం సంబందిత అధికారులతో మాట్లాడారు. కూలీల హాజరు, జరుగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వేణుగోపాలపురం వద్ద హరితహారం నర్సరీని పరిశీలించారు. ఆయన వెంట కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ, ఎంపీడీఓ సంజీవయ్య, ఎంపీఓ విజయకుమారి, కార్యదర్శులు నారాయణరెడ్డి, విజయలక్ష్మి, ఈసీ శ్రీను ఉన్నారు.
అభివృద్ధి పనులకు రూ.49.59కోట్లు
హుజూర్‌నగర్ : రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లో అభివృద్ధిలో తనదైన మార్కు చూపుతున్నారు. రెండు నియోజకవర్గాల్లో ఇటీవల అభివృద్ధి పనులకు రూ 49.59 కోట్లు మంజూరు చేయించారు. గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో ఏర్పాటుచేసే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్‌కు వెళ్లేందుకు డబుల్‌రోడ్డు నిర్మాణానికి రూ. 20 కోట్లు , హుజూర్‌నగర్ – చిలుకూరు మార్గ మధ్యలో నిర్మించతల పెట్టిన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ వరకు డబుల్ రోడ్ నిర్మాణానికి రూ. 10 కోట్లు మంజూరు చేయించారు. హుజూర్‌నగర్ పట్టణంలోనీ రాజీవ్ గాంధీ జంక్షన్ నుంచి పట్టణ శివారులోని హౌసింగ్ కాలనీ వరకు రహదారి విస్తరణ, అభివృద్ధికి రూ 6.50 కోట్లు, పట్టణంలో నిర్మించ తలపెట్టిన నీటిపారుదల డివిజనల్ కార్యాలయానికి రూ 7.99 కోట్లు, కోదాడలో నీటిపారుదల సూపరింటెండెంట్ ఇంజనీర్ సర్కిల్ కార్యాలయానికి రూ 5.10 కోట్లు మంజూరు చేయించారు.
ఖైదీల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి
చివ్వెంల(సూర్యాపేట) : ఖైదీల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూర్యాపేట జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పి.శ్రీవాణి సూచించారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సబ్ జైలును ఆమె సందర్శించారు. ఖైదీల ఆరోగ్య సమస్యలు, ఆహారం, వసతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ సుధాకర్‌రెడ్డి, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్ గౌడ్, పెండెం వాణి పాల్గొన్నారు.
చైర్‌పర్సన్‌గా చామంతి
బాధ్యతల స్వీకరణ
తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్‌పర్సన్‌గా ఎల్సోజు చామంతిరమేష్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. వైస్ చైర్మన్‌గా చింతరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, డైరెక్టర్లుగా దేశగాని రాములు, ఆంగోతు రాములు, ఉప్పలయ్య, బైరబోయిన సైదులు, అంజయ్య, వేణుగోపాల్‌రావు, ఎం.డి.హఫీజ్, జలేందర్, వాసుదేవరెడ్డి, రాపాక సోమేష్, దొడ్డ రమేష్, పీఏసీఎస్ చైర్మన్ పాలెపు చంద్రశేఖర్ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మందుల సామేలు, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న మార్కెట్ కార్యదర్శి అనిల్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
గోదావరి జలాలు పెంపు
Comments
Please login to add a commentAdd a comment