తాగునీటి కష్టాలకు చెక్
సర్వే ఇలా..
జిల్లాలో ఐదు మున్సిపాలిటీల పరిధిలో 141 వార్డుల్లో అధికారులు సర్వే చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా తాగు నీటి పైపుల లీకేజీలు, పగుళ్లు, ట్యాంకుల నుంచి పట్టణానికి సరఫరా చేసే ప్రధాన పైపు లైన్ పరిస్థితి, కాలనీలో ఉన్న నీటి ట్యాంకులు, బోర్లు, చేతి పంపులు, నల్లాలకు బిరడాలు లేక పోవడం తదితర వివరాలు సేకరిస్తున్నారు. ప్రత్యామ్నాయ నీటి వివరాలను సేకరిస్తున్నారు. ముందుగా సమస్య ఎక్కువగా ఉండే శివారు కాలనీలకు ప్రాధాన్యమిస్తున్నారు. సమస్య ఉన్న చోట క్షేత్ర స్థాయిలో లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ప్రజలతో చర్చించి పరిష్కారానికి మార్గాలు నమోదు చేస్తున్నారు. సమస్యతో పాటు దాని పరిష్కార మార్గాన్ని చూపుతూ నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
తిరుమలగిరి (తుంగతుర్తి) : వేసవి కాలంలో మున్సిపాలిటీల్లో తాగు నీటి ఇబ్బందులను అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం సర్వే చేపట్టింది. నీటి సరఫరా కోసం ఏ ఏ మరమ్మతులు అవసరమో గుర్తించాల్సిందిగా సూచించింది. ఈ నేపథ్యంలో అధికారులు బృందాలుగా ఏర్పడి మున్సిపాలిటీల్లో వివరాలు సేకరిస్తున్నారు. సర్వే పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక పంపాల్సి ఉంది. క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తేనే సమస్యలు పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని భావించి ప్రభుత్వం ఈ ప్రక్రియ చేపట్టింది.
బృందాలుగా ఏర్పడి..
మున్సిపాలిటీలో వార్డుల సంఖ్యను బట్టి అధికారులు బృందాలుగా ఏర్పడి సర్వే చేస్తున్నారు. ఒక్కో బృందంలో ఏఈ స్థాయి అధికారి, ముగ్గురు వార్డు అధికారులు ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో సమస్యకు గల కారణాలు తెలుసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో తాత్కాలిక చర్యలు మాత్రమే చేపట్టి చేతులు దులుపుకుంటున్నారు. అలా కాకుండా సమస్యను సరిగ్గా గుర్తించగలిగితేనే ప్రయోజనం ఉంటుంది. గత వేసవిలో మున్సిపాలిటీలకు పాలక వర్గాలు ఉండేవి. వాటి గడువు తీరడంతో అధికారులే ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవడానికి కసరత్తు చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఫ మున్సిపాలిటీల్లో మంచి నీటి
సమస్యలపై సర్వే
ఫ బృందాలుగా ఏర్పడి వివరాల సేకరణ
ఫ సమస్యలు.. పరిష్కారమార్గాలతో ప్రభుత్వానికి నివేదిక
మున్సిపాలిటీ వార్డులు
సూర్యాపేట 48
కోదాడ 35
హుజూర్‌నగర్ 28
తిరుమలగిరి 15
నేరేడుచర్ల 15
Comments
Please login to add a commentAdd a comment