ఇంటర్ సెకండ్ ఇయర్‌కు 7,416 మంది హాజరు
సూర్యాపేటటౌన్ : ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 32 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరిగింది. జనరల్ విభాగంలో 6,306 మందికి 172 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 6,134 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 1,389 మంది విద్యార్థులకు 107 మంది గైర్హాజరు కాగా 1,282 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం మీద సెకండ్ ఇయర్ తొలి రోజు పరీక్షకు 7,416 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్ష కేంద్రాలను అధికారులు తనిఖీలు చేశారు.
పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్
జిల్లా కేంద్రంలోని పరీక్ష కేంద్రాలను గురువారం సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్‌పవార్ తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించి, విద్యార్థుల హాజరు శాతం గురించి చీఫ్ సూపరింటెండెంట్ యాదయ్య ను అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాల నిఘా నడుమ నిబంధనలకు అనుగుణంగా పరీక్ష నిర్వహించాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీటి వసతి, అత్యవసర వైద్య సేవల కేంద్రం ఏర్పాటు, మరుగుదొడ్లు, కళాశాలలో ఎలాంటి వ్యర్థ్యాలు లేకుండా పరిశుభ్రంగా ఉండాలని సూచించారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సజావుగా పరీక్షలు నిర్వహించాలన్నారు. పరీక్ష పూర్తయిన వెంటనే జవాబు పత్రాలను పోలీసు బందోబస్తు మధ్య క్లోజ్డ్ వాహనంలో నిర్దేశిత కేంద్రాలకు తరలించాలని సూచించారు. పరీక్షలు పూర్తి పారదర్శకంగా నిర్వహించాలన్నారు. సెల్ ఫోన్‌న్లు, ఎలక్ట్రానిక్ వాచ్‌లు వంటి ఉపకరణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించకూడదన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment