రెండు నూతన జాగిలాలు వచ్చాయ్
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖకు ట్రాకర్ డాగ్ లూసీ , ఎక్స్–ప్లోజివ్ డాగ్ బ్రూనో అనే రెండు నూతన జాగిలాలను కేటాయించారు. ఈ సందర్భంగా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో నిర్మించిన డాగ్ షెల్టర్ రూంలను ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ గురువారం ప్రారంభించారు. ముందుగా ఎస్పీకి ట్రాకర్ డాగ్ లూసీ పూలబొకే తో స్వాగతం పలికింది. ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో విధుల నిర్వహణ, కేసుల ఛేదనలో జాగిలాలకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. చాలా కేసుల్లో నేరస్తులను పసిగట్టడంలో డాగ్స్ బాగా పని చేశాయని, హంటర్, ట్రాకర్, నార్కోటిక్, ఎక్స్ ప్లోజివ్ ఇలా 6 విభాగాల్లో శిక్షణ పొందిన డాగ్స్ మనకు ఉన్నాయన్నారు. ఇప్పుడు కొత్తగా ట్రాకర్ డాగ్ (పేరు లూసీ) ఇది నేర స్థలంలో లభించే ఆధారాలతో నేరస్తులను గుర్తిస్తుందని, మరో డాగ్ ఎక్స్ ప్లోజివ్ (పేరు బ్రూనో) ఇది పేలుడు సామగ్రిని గుర్తిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ లు నాగేశ్వరరావు, జనార్ధన్ రెడ్డి, ఏఆర్ డీఎస్పీ నరసింహ చారి, ఆర్‌ఐలు నారాయణ రాజు, నరసింహ, డాగ్ స్క్వాడ్ ఆర్‌ఎస్‌ఐ రాజశేఖర్ పాల్గొన్నారు.
ఫ డాగ్ షెల్టర్ రూమ్‌లను ప్రారంభించిన ఎస్పీ సన్ ప్రీత్ సింగ్
రెండు నూతన జాగిలాలు వచ్చాయ్
రెండు నూతన జాగిలాలు వచ్చాయ్
Comments
Please login to add a commentAdd a comment