అగ్గితెగులు నివారణకు చర్యలు తీసుకోవాలి
అర్వపల్లి: వరిలో అగ్గితెగులు నివారణకు రైతులు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌రెడ్డి కోరారు. అర్వపల్లి, రామన్నగూడెం, వేల్పుచర్ల తదితర గ్రామాల్లో వరి పొలాలను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరి పొలాల్లో ప్రస్తుతం అగ్గితెగులు, కాండం తొలుచు పురుగును గుర్తించినట్లు తెలిపారు. రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గి చలి పెరగడం వల్ల అగ్గితెగులు వృద్ధి ఎక్కువ అయినట్లు తెలిపారు. అగ్గితెగులు నివారణకు టైప్లోక్సీ ట్రోబిన్, టేబ్యు కొనజోల్ లేదా ట్రైసైక్లోజోల్, కాండం తొలుచుపురుగు నివారణకు కార్టైఫెడ్రాక్రై ్లడ్ ను పిచికారీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పెందోట గణేష్, ఏఈఓ శోభారాణి, ఖమ్మంపాటి నరేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment