విశ్వ ఉనికి రహస్యం భౌతికమే
ఫ ఉస్మానియా యూనివర్సిటీ
రిటైర్డ్ ప్రొఫెసర్ కవి కిషోర్
నల్లగొండ టూటౌన్: విశ్వ ఉనికి రహస్యం భౌతికమే అని ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కవి కిషోర్, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. గురువారం మహాత్మాగాంధీ యూనివర్సిటీలో సైన్స్ విభాగం ప్రిన్సిపాల్ ప్రేమ్‌సాగర్ అధ్యక్షతన నిర్వహించిన జాతీయ సైన్స్ దినోత్సవం కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ప్రతి విద్యార్థి వైజ్ఞానిక దృష్టిని అలవర్చుకొని జీవన విధానములో అన్వయించుకోవాలన్నారు. సమాజంలో ఎదురయ్యే అనేక సవాళ్లకు సైన్స్ ద్వారా పరిష్కార మార్గాలను కనుగొనాలన్నారు. విశ్వ రహస్యాలను శాస్త్రవేత్తలు ఇప్పటికీ కేవలం 30 శాతం మాత్రమే విశ్లేషించగలిగారని అన్నారు. మానవుల్లో కొంత శాతం మేర జంతువుల జన్యులతో పోలిన జన్యువులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారని వివరించారు. మానవ స్వభావాలు అనేకం జన్యు ప్రేరేపితంగా ఉన్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపేందర్‌రెడ్డి, అన్నపూర్ణ, దోమల రమేష్, కళ్యాణి, రూప, రామచందర్‌గౌడ్, జ్యోతి, శివరాం పాల్గొన్నారు.
లేఖా రచనలో కోదాడ వాసికి ప్రథమ బహుమతి
కోదాడ: భారతీయ తపాలా శాఖ ఆధ్వర్యంలో ‘లేఖా రచనలో ఆనందం–డిజిటల్ యుగంలో లేఖా రచన ఆవశ్యకత’ అనే అంశంపై జాతీయ స్థాయిలో నిర్వహించిన లేఖా రచన పోటీల్లో కోదాడ పట్టణానికి చెందిన ఉస్తేల సోమిరెడ్డి ప్రథమ బహుమతి(రూ.25 వేలు) సాధించారు. సోమిరెడ్డి ప్రస్తుతం నిజామాబాద్ డివిజన్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. గతంలో తన కుమారుడికి రాసిన ఉత్తరాలను ‘ఇట్లు నాన్న’ పేరుతో సంకలనాన్ని ప్రచురించారు. తన భార్య రమకు రాసిన ఉత్తరాలతో ‘రమణీయం’ పేరుతో మరో సంకలాన్ని ప్రచురించారు. లేఖా రచనలో తనకు ఉన్న అభిరుచికి బహుమతి రావడం ఆనందంగా ఉందన్నారు.
విశ్వ ఉనికి రహస్యం భౌతికమే
Comments
Please login to add a commentAdd a comment