రూ.2వేల కోట్లకు చేరువలో రుణాల పంపిణీ
నల్లగొండ టౌన్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా రుణాల పంపిణీ రూ.2వేల కోట్లకు చేరుకుందని బ్యాంకు చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని డీసీసీబీలో నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.580కోట్ల బంగారు రుణాలు, రూ.571 కోట్ల పంట రుణాలు, రూ.405 కోట్ల మార్టిగేజ్ రుణాలు, రూ.379 కోట్ల దీర్ఘకాలిక రుణాలు అందించినట్లు తెలిపారు. బ్యాంకు వ్యాపారం రూ.3వేల కోట్లకు చేరువలో ఉండగా, రూ.50 కోట్ల లాభాల దిశలో డీసీసీబీ పయనిస్తుందన్నారు. రైతుల ప్రయోజనాల కోసం గ్రామీణ ప్రాంతాల్లో గృహ రుణాలను సులభతరం చేశామని, పౌల్ట్రీ రుణాల చెల్లింపు కాల పరిమితిని పెంచామన్నారు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకం కింద అదనపు రుణాలను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ సమావేశంలో సీఈఓ శంకర్‌రావు, డైరెక్టర్లు లింగం యాదవ్, పాశం సంపత్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సైదయ్య, కోడి సుష్మ తదితరులు పాలొగన్నారు.
ఫ డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment