చివ్వెంల(సూర్యాపేట): జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇన్‌చార్జ్ ప్రధాన న్యాయమూర్తి శ్యామ్‌శ్రీ అన్నారు. శుక్రవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సంవత్సరాల తరబడి పరిష్కారం కాని సివిల్, క్రిమినల్, బ్యాంకు, మోటార్ వెహికల్ యాక్టు, విద్యుత్ వంటి కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. జిల్లా కేంద్రంతోపాటు తుంగతుర్తి, కోదాడ, హుజూర్‌నగర్ కోర్టుల్లో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీవాణి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment