జగన్మోహినిగా వెలిగి.. ఎదుర్కోలుకు కదిలి
స్వామి, అమ్మవారిని
ఊరేగింపుగా ఎదుర్కోలు
మండపానికి తోడ్కొని వెళ్తున్న అర్చకులు, అధికారులు.. చిత్రంలో పట్టువస్త్రాలతో
కలెక్టర్ దంపతులు, ఈఓ
యాదగిరిగుట్ట: యాదగిరీశుడి బ్రహ్మోత్సవాలు ఆగమశాస్త్రం ప్రకారం వైభవంగా కొనసాగుతున్నాయి. కల్యాణోత్సవానికి ముందస్తుగా పెళ్లిచూపుల పర్వం జరుపుకున్న శ్రీస్వామివారు శుక్రవారం ఉదయం జగన్మోహిని రూపం దాల్చారు. రాత్రి అశ్వవాహనంపై ఎదుర్కోలు జరుపుకున్నారు.
ఎదుర్కోలు మహోత్సవం సాగిందిలా..
బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన ఎదుర్కోలు మహోత్సవం శుక్రవారం రాత్రి వేదపండితుల మంత్రోచ్ఛరణలతో సాగింది. పట్టువస్త్రాలు, బంగారు ఆభరణలతో అలంకరించిన శ్రీస్వామివారిని అశ్వవాహనంపై, అమ్మవారిని ముత్యాల పల్లకిపై అధిష్టింపజేసి ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. అంతకుముందు ఉదయం శ్రీలక్ష్మీనరసింహుడు జగన్మోహిని అలంకారంలో ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
బ్రహ్మోత్సవాల్లో నేడు
లక్ష్మీసమేత నారసింహుడు శనివారం ఉదయం రామాలంకారంలో హనుమంత సేవపై దర్శనమిస్తారు. రాత్రి 8.30 గంటలకు నుంచి గజవాహన సేవపై ఊరేగింపుగా కల్యాణమండపానికి బయలుదేరి వెళ్లారు. అనంతరం స్వామి, అమ్మవారి తిరుకల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు.
జగన్మోహినిగా వెలిగి.. ఎదుర్కోలుకు కదిలి
Comments
Please login to add a commentAdd a comment