మహిళలు అన్నిరంగాల్లో ముందుండాలి
భానుపురి (సూర్యాపేట): మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యవసాయం, వృత్తి నైపుణ్యం, పారిశ్రామిక, వ్యాపార రంగాలు, కళల్లో మహిళలు పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారన్నారు. అనంతరం మహిళా అధికారులను సన్మానించారు. ఆటలపోటీల్లో గెలిచిన సిబ్బందికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ అభివృద్ధి అధికారి నరసింహారావు, షెడ్యూల్ కులాల సంక్షేమ అధికారి కే.లత, మెప్మా పీడీ అధికారిణి రేణుకాదేవి, టౌన్ ప్లానింగ్ అధికారిణి మాధవి, జిల్లా లీగల్ కౌన్సిల్ అడ్వకేట్ వాణి, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీర్ మాధవి పాల్గొన్నారు.
పూర్తి నివేదికలతో రావాలి
ఈనెల 11వ తేదీన ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన ఉన్నందున అధికారులు పూర్తి నివేదికలతో కమిషన్ నిర్వహించే సమావేశానికి హాజరుకావాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్‌పవార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అన్ని శాఖల జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు తమ శాఖ పరిధిలో ఎస్సీ, ఎస్టీలకు కల్పించిన సౌకర్యాలు, అభివృద్ధి నివేదికలు సోమవారంలోగా అందించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాంబాబు, డీఆర్డీఏ పీడీ అప్పారావు, డీఎస్‌ఓ రాజేశ్వరరావు, డీఈఓ అశోక్, డీఎంహెచ్‌ఓ కోటాచలం, ఎస్సీ అభివృద్ధి అధికారి లత పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్
Comments
Please login to add a commentAdd a comment