బీడు భూములు సేద్యానికి అనువుగా మార్చుకోవాలి
అర్వపల్లి: రైతులు తమ బీడు భూములను ఉపాధి హామీ పథకం ద్వారా సేద్యానికి అనువుగా మార్చుకోవాలని అదనపు కలెక్టర్ రాంబాబు కోరారు. జాజిరెడ్డిగూడెం మండలం కోమటిపల్లిలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా చేపట్టిన బీడు భూముల అభివృద్ధి (ఎల్‌డీపీ) పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీఓ టి. గోపి, పంచాయతీ కార్యదర్శి జ్యోతి, ఫీల్డ్ అసిస్టెంట్ తేలు పరుశురాములు ఉన్నారు.
ఉపాధి పనులు పారదర్శకంగా నిర్వహించాలి
నాగారం: ఉపాఽధిహామీ పనులు పారదర్శకంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. శుక్రవారం నాగారం మండల పరిధిలోని ఫణిగిరి గ్రామంలో జరుగుతున్న ఉపాధిహామీ పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్య పెంచుతూ, పనిలో నాణ్యత పాటించాలని సూచించారు. జాబ్‌కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి 100 రోజులు ఉపాధి పనులు కల్పించాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ బ్రహ్మయ్య, ఎంపీడీఓ మారయ్య, ఏపీఓ రవి, ఆర్‌ఐ అల్లావుద్దీన్, పంచాయతీ కార్యదర్శి సురేష్, ఈసీ ముక్కంటి ఉన్నారు.
ఫ అదనపు కలెక్టర్ రాంబాబు
Comments
Please login to add a commentAdd a comment