హుజూర్‌నగర్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన జాతీయ వ్యవసాయ మార్కెట్ విధాన ముసాయిదా రైతులకు వ్యతిరేకమైనదని, దీన్ని వెంటనే రద్దుచేయాలని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ డిమాండ్ చేశారు. రైతు సంఘం జిల్లా నాలుగో మహాసభలు శనివారం హుజూర్‌నగర్‌లో కంబాల శ్రీనివాస్, కొప్పోజు సూర్యనారాయణ, మోరకొండ లక్ష్మయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 25, 26, 27 తేదీల్లో నిజామాబాద్ పట్టణంలో జరుగుతున్న రైతు సంఘం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. రైతు సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులుగా మూరగొండ లక్ష్మయ్య, కొప్పోజు సూర్యనారాయణ, అధ్యక్షుడిగా దొడ్డ వెంకటయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ గా బొల్లు ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా కంబాల శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా పాపిరెడ్డిలతో మరో 27 మందితో జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బెజవాడ వెంకటేశ్వర్లు, యల్లావుల రాములు, కృష్ణారెడ్డి, గుండు వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు ధనుంజయ్ నాయుడు, కౌలు రైతుల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొల్లు ప్రసాద్, పాపిరెడ్డి మహిళా సమాఖ్య నాయకులు మల్లీశ్వరి, ఉమా తదితరులు పాల్గొన్నారు.