ఈ సంవత్సరం మిర్చి రైతులకు మందులు, కూలీలకు ఇచ్చే కూలి ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో ఒకటికి నాలుగు సార్లు మందులు పిచికారీ చేయాల్సి వచ్చింది. దీంతో గతంలో ఎకరాకు రూ.10వేలు ఖర్చు పెట్టాల్సి ఉండగా ఈసారి రూ.20వేలుపైనే ఖర్చు పెట్టారు. గతంలో ఎకరం మిర్చి ఏరడానికి 50 మంది కూలీలు అవసరం ఉండగా.. ఇప్పుడు 70 మంది కూలీలు అవసరమవుతున్నారు. దీంతో 20మంది కూలీల ఖర్చు పెరిగింది. గతంలో వచ్చిన దిగుబడి ఈసారి రాకపోవడంతోపాటు పెట్టుబడి పెరిగిందని రైతులు వాపోతున్నారు.