
ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా సీఎం సభ ఏర్పాట్లు
హుజూర్‌నగర్ : ఉగాది నాడు హుజూర్‌నగర్‌లో జరిగే సీఎం సభకు ట్రాఫిక్ సమస్యల తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ తెలిపారు. హుజూర్‌నగర్ పట్టణంలో జరుగుతున్న సీఎం సభా ఏర్పాట్లను ఎస్పీ నరసింహతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. సభాస్థలి, సభికుల ప్రాంగణం, బారికేడ్లు, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించి కాంట్రాక్టర్‌కు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆర్‌డీఓ శ్రీనివాసులు, ము న్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, విద్యుత్ డీఈ వెంకట కిష్టయ్య, డీఎస్‌పీ శ్రీధర్‌రెడ్డి, సీఐ చరమంద రాజు, తహసీ ల్దార్ నాగార్జునరెడ్డి పాల్గొన్నారు.
పండుగవాతావరణంలో పంపిణీ చేయాలి
భానుపురి (సూర్యాపేట): రేషన్ షాపుల్లో ఏప్రిల్ 1 నుంచి పండుగ వాతావరణంలో సన్నబియ్యం పంపిణీ చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్ లో సన్న బియ్యం పంపిణీపై రేషన్ డీలర్లతో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ రాంబాబు తో కలిసిమాట్లాడారు. ఉగాది రోజు సీఎం రేవంత్ రెడ్డి హుజూర్ నగర్‌లో సన్న బియ్యం పంపిణీని ప్రారంభిస్తారని తెలిపారు. సమావేశంలో డీఎస్‌ఓ రాజేశ్వర్, సివిల్‌సప్లయ్ డీఎం ప్రసాద్ పాల్గొన్నారు.
దరఖాస్తులు పరిశీలించి మంజూరు చేయాలి
భానుపురి (సూర్యాపేట) : నూతన పరిశ్రమలకు పెట్టిన దరఖాస్తులను పరిశీలించి మంజూరు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ తెలిపారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. డిజి టల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ స్కీం ద్వారా నిరుద్యోగులు మొబైల్ యాప్ లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ వీవీ అప్పారావు, డీపీఓ యాదగిరి, ప్రకా ష్ రెడ్డి, రామకృష్ణ, సంతోష, యాదగిరి, బాపూ జీ, శ్రీనివాస్ నాయక్, శంకర్ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్