హుజూర్‌నగర్: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాలు(ఎస్‌హెచ్‌జీలు) ఒకే గొడుగు కిందకు రానున్నాయి. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే మహిళా సంఘాలు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్), మున్సిపల్ ప్రాంతాల్లోని సంఘాలు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతూ వస్తున్నాయి. అయితే ఈ రెండు విభాగాలకు చెందిన సంఘాలన్నింటినీఒకే గొడుగు కిందకు తీసుకుని రావాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మెప్మాను సెర్ప్‌లో విలీనం చేయడంతో పాటు ఉద్యోగులను డీఆర్‌డీఏ పరిధిలోకి తీసుకురానున్నారు.
డీఆర్‌డీఓ పర్యవేక్షణలో..
ప్రస్తుతం మెప్మా ఉద్యోగులు మున్సిపల్ కమిషనర్ల పర్యవేక్షణలో విధులు నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీలలో మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీలు, సీ్త్రనిధి రుణాలు ఇప్పించడంతో పాటు ఇందిరా మహిళాశక్తి అమలులో ఈ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారు. సెర్ప్‌లో విలీనమైతే వీరంతా ఇక నుంచి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్‌డీఓ) పర్యవేక్షణలో పనిచేయాల్సి ఉంటుంది.
ఏ సర్వే చేపట్టినా మెప్మా ఆర్పీలకే బాధ్యతలు
మున్సిపాలిటీల పరిధిలో ప్రభుత్వం ఏ సర్వే చేపట్టినా మెప్మా ఆర్పీలకే ఆ బాధ్యతలు అప్పగించేవారు. ఓటర్ల జాబితా సవరణ, ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక, కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులపై విచారణ తదితర పనులకు మెప్మా ఆర్పీల సేవలను వినియోగించుకునే వారు. వీరిని సెర్ప్‌లో విలీనం చేస్తే మున్సిపాలిటీల్లో ప్రభుత్వం నిర్వహించే వివిధ రకాల సర్వేలకు ఇబ్బందులు కలిగే అవకాశం లేకపోలేదు. అయితే ఇప్పుడున్న టీఎంసీలు, సీఓలు, ఆర్పీలను డీఆర్‌డీఏ కిందకు తెస్తారా లేక మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షణలోనే ఉంచుతారా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
మెప్మా, సెర్ప్‌లను ఒకే గొడుగు
కిందకు తేవాలని ప్రభుత్వం నిర్ణయం
ఇక.. అన్ని గ్రూప్‌లు
డీఆర్‌డీఏ పరిధిలోకి..
జిల్లాలో మొత్తం స్వయం సహాయక సంఘాలు 23,345
స్వయం సహాయక సంఘాల వివరాలు
మండలాల్లో 17,940
మున్సిపాలిటీల్లో 5,405
మొత్తం సభ్యులు 2,38,331
23 మండలాల్లో వీఓలు 579
ఉత్తర్వులు రావాల్సి ఉంది
సెర్ప్, మెప్మా విలీనానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉంది. ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఆదేశాల మేరకు కార్యాచరణ రూపొందించి అమలు చేస్తాం.
– రేణుక, మెప్మా,
ఇన్‌చార్జి పీడీ, సూర్యాపేట