మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలోని హుండీలను గురువారం సహాయ కమిషనర్ కె.భాస్కర్, ఆలయ ధర్మకర్తలు, ఎండోమెంట్ అధికారుల పర్యవేక్షణలో ఆలయ ప్రాంగణంలో లెక్కించారు. ఫిబ్రవరి 14నుంచి మార్చి 26వరకు 41 రోజులకు గాను రెగ్యులర్ హుండీల ద్వారా రూ.6,04,125ు, అన్నదానం హుండీ ద్వారా రూ.30,370తో కలిపి మొత్తం రూ.6,34,495 ఆదాయం సమకూరినట్టు ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్‌కుమార్ తెలిపారు. ముందుగా ఆయలంలో స్వామివారి నిత్యకల్యాణాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు, అర్చకులు, శ్రీసాయి సేవాసంఘం ప్రతినిధులు, పాల్గొన్నారు.