
సర్వాయి పాపన్నను స్ఫూర్తిగా తీసుకోవాలి
భానుపురి: సమాజంలోని అన్యాయాలపై ధైర్యంగా పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్నను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ పేర్కొన్నారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. సామాజిక న్యాయం కోసం పాపన్న చేసిన కృషి స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.రాంబాబు, జెడ్పీ సీఈఓ అప్పారావు, సంక్షేమ అధికారులు శ్రీనివాస్ నాయక్, శంకర్, లత, జగదీశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.