
పెండింగ్ పనులు త్వరగా పూర్తిచేయాలి
హుజూర్‌నగర్, హుజూర్‌నగర్ రూరల్: కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని జలసౌదలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతితో కలిసి హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాలకు చెందిన వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్, రోడ్లు, కాలువ లైనింగ్ పనులను మూడె నెలల్లో పూర్తిచేయాలన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ పనుల డిజైన్లను అధికారులు తమ ఇష్టానుసారం మార్చవద్దన్నారు. కొత్త మండలాలకు మంజూరైన ప్రభుత్వ భవనాలను వెంటనే పూర్తిచేయాలని చెప్పారు. ఎవరైనా చెరువులు, ఎన్‌ఎస్‌పీ కాలువల స్థలాల ఆక్రమణకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. మేళ్లచెరువులో ఎన్నెస్పీ కాలవపై మూడు చోట్ల ఉన్న బ్రిడ్జీలను వెంటనే నిర్మించాలన్నారు. హుజూర్‌నగర్‌కు నూతనంగా మంజూరైన అగ్రికల్చర్ కళాశాలకు 100 ఎకరాలు, కోదాడలో జవహర్ నవోదయ విద్యాలయానికి 25 ఎకరాల స్థలం అవసరం ఉందని అధికారులు దానిని సేకరించాలని సూచించారు. ఆయా పనులను వారం రోజుల్లో పరిశీలిస్తానని మంత్రి తెలిపారు. హుజూర్‌నగర్ నియోజకవర్గానికి రూ.1,15,701.94 కోట్లు, కోదాడ నియోజకవర్గానికి రూ.51,999.81 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. వీటిని విధధ శాఖలకు సంబంధించిన పనులకు కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో నీటిపారుదల స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ పాటిల్, ఆర్ అండ్ ఆర్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, ఈఎన్‌సీ అనిల్, సీఈ రమేష్, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు
ఫ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి