
చెడు వ్యసనాలకు బానిస కావొద్దు
నేరేడుచర్ల: విద్యార్థులు, యువత చెడు వ్యసనాలకు బానిస కావొద్దని యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డీఎస్పీ భిక్షపతి అన్నారు. శుక్రవారం నేరేడుచర్లలోని న్యూ అరబిందో డిగ్రీ, స్పందన జూనియర్ కళాశాలలో డ్రగ్స్‌పై అవగాహనకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. జూన్ 16న యాంటీ నార్కోటిక్ డే సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులకు మాదకద్రవ్యాలు– వాటి అనర్థాలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ కట్ట ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ప్రిన్సిపాల్ యడవల్లి వెంకట్‌రెడ్డి, కానిస్టేబుల్ స్వామి తదితరులున్నారు.