
ప్రజల్లో చైతన్యానికే పోలీస్ ప్రజా భరోసా
అర్వపల్లి: ప్రజలను చైతన్యం చేసేందుకే పోలీస్ ప్రజా భరోసా లక్ష్యమని ఎస్పీ నరసింహ అన్నారు. శుక్రవారం అర్వపల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో సామాజిక అంశాలు, చట్టాలపై ప్రతి బుధవారం సమావేశం నిర్వహిస్తూ పోలీస్ ప్రజా భరోసా ద్వారా అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. ప్రతి బుధవారం ఒక గ్రామాన్ని ఎంచుకొని పోలీస్ అధికారులు పాల్గొనేలా సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తాను కూడా ప్రతివారం ఒక గ్రామాన్ని సందర్శిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో సూర్యాపేట డీఎస్పీ పార్థసారధి, నాగారం సీఐ రఘువీర్‌రెడ్డి, ఎస్‌ఐ బాలకృష్ణ, ఏఎస్‌ఐలు రామకోటి, రాములు పాల్గొన్నారు.
ప్రతి గ్రామ చరిత్ర పోలీసు రికార్డుల్లో నమోదు
తుంగతుర్తి: ప్రతి గ్రామ చరిత్ర పోలీసు రికార్డుల్లో నమోదు చేయబడి ఉంటుందని ఎస్పీ నరసింహ అన్నారు. శుక్రవారం తుంగతుర్తి పోలీస్ స్టేషన్‌ను ఆయన సందర్శించారు. పౌరులు చట్టానికి లోబడి నడుచుకోవాలన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని, శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరారు. అనంతరం రికార్డులను పరిశీలించి పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట డీఎస్పీ పార్థసారధి, ఎస్సై క్రాంతి కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఫ ఎస్పీ నరసింహ