రవాణా సంస్థకు 145 కొత్త కార్లు | - | Sakshi
Sakshi News home page

రవాణా సంస్థకు 145 కొత్త కార్లు

Published Tue, Apr 18 2023 1:12 AM | Last Updated on Tue, Apr 18 2023 8:26 AM

- - Sakshi

కొరుక్కుపేట: డ్రైవింగ్‌ లైసెన్స్‌ పరీక్షల కోసం కొత్తగా రవాణా సంస్థకు 145 కొత్త కార్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు కార్లు కొనుగోలుకు రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో డ్రైవింగ్‌ శిక్షణ స్కూళ్లు, మరిన్ని ప్రభుత్వ అనుమతితో నడుస్తున్నాయి. ప్రతి పాఠశాలలో కోచ్‌లు, కార్యాలయ సహాయకులు పని చేస్తున్నారు. ప్రతి పాఠశాలలో శిక్షణ అందించే ఇతర సేవలు ఫీజులు మారుతుంటాయి. డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందేందుకు దరఖాస్తుదారుడు చాలాఖర్చు చేయాల్సి వస్తుంది. వాహనాలు ఏర్పాటు చేయలేని వారి సౌకర్యార్థం ఢిల్లీలోని సరాయ్‌ కాలేగావ్‌ జిల్లా రవాణా కార్యాలయంలో అద్దెకు కార్లను అందించే కొత్త పథకం అమలు చేశారు. అదేవిధంగా త్వరలో తమిళనాడులో కూడా సొంతంగా కారు లేని వారు ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో అందుబాటులో ఉన్న కార్లను ఉపయోగించి డ్రైవింగ్‌ లైసెన్స్‌ పరీక్షలు చేయించుకోనున్నారు.

ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి ఎస్‌ఎస్‌ శివశంకర్‌ మాట్లాడుతూ దరఖాస్తుదారులు స్కూళ్లకు చేరుకుని వారు అడిగిన ఫీజులు చెల్లిస్తున్నారని తెలిపారు. డ్రైవింగ్‌ టెస్ట్‌లో పాల్గొనేందుకు కారు లేకపోవడంతో ఈ సమస్య తలెత్తుతోంది. అందుకోసం తమిళనాడులో 145 ఆర్టీఓ కార్యాలయాలకు కూడా లైట్‌ మోటార్‌ వాహనాలను కొనుగోలు చేయబోతున్నామని తెలిపారు. దీంతో వృత్తి విద్యా పాఠశాలల ప్రభావం తగ్గుతుందని రవాణాశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం డ్రైవింగ్‌ స్కూళ్లు దరఖాస్తుదారుడి నుంచి రూ.5000 నుంచి రూ.10,000 వరకు అడుగుతున్నాయి. చాలామంది తమ స్నేహితులు, బంధువుల సహాయంతో డ్రైవింగ్‌ నేర్చుకుంటున్నప్పటికీ, వారు డ్రైవింగ్‌ స్కూళ్లను సంప్రదించి అదనపు డబ్బు చెల్లిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement