సంగీతమే నా ప్రాణం
కొరుక్కుపేట: సంగీతమే తన ప్రాణం అని ప్రఖ్యాత గాయని శ్రేయ ఘోషల్ అన్నారు. ఫిక్కీ ఫ్లో – చైన్నె ఆధ్వర్యంలో భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ, బహుముఖ ప్రజ్ఞాశాలి, నేపథ్య గాయకులలో ఒకరైన శ్రేయా ఘోషల్‌తో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిక్కీ ఫ్లో చైన్నె అధ్యక్షురాలు
సీఏ దివ్య అభిషేక్ అధ్యక్షతన ఏర్పాటు అయిన ఈ కార్యక్రమంలో శ్రేయ ఘోషల్ శ్రేయ ఘోషల్ భారతీయ సంగీత పరిశ్రమలో తన ప్రయాణాన్ని పంచుకున్నారు. ఆమె అనుభవాలు, సవాళ్లు, విజయాల గురించి ఫిక్కీ ఫ్లో మహిళా సభ్యులతో పంచుకున్నారు. అలాగే ఆమె వివిధ భాషల్లో పాడిన పలు పాటలను అలపించి ఆహూతులను ఉర్రూతలూగించారు. తన జీవితంలో దిగ్గజ సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్‌ను మరిచిపోలేనని, ఆయన నాకు దేవుడితో సమానం అని అభిప్రాయ పడ్డారు. ఫిక్కీ ఫ్లో చైన్నె చైర్‌పర్సన్ దివ్య అభిషేక్ మాట్లాడుతూ గాయని శ్రేయ ఘోషల్ ప్రయాణం అంకితభావం, ప్రతిభ, స్థితిస్థాపకతకు నిదర్శనం అని, ఆమె యువ మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో 475 మందికి పైగా ఫిక్కీ ఫ్లో చైన్నె మహిళా సభ్యులు, విశిష్ట అతిథులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు పాల్గొన్నారు, శ్రేయా ఘోషల్ నిర్వహిస్తున్న ఆల్ హార్ట్స్ టూర్ మార్చి 1వ తేదీన చైన్నెలోని వైఎంసీఏ గ్రౌండ్స్– నందనంలో జరుగుతోందని, అందరూ విచ్చేసి ఆమె సంగీతాన్ని విని ఆస్వాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పియానోయిస్ట్ అనిల్ శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment