నిధుల కేటాయింపులో వివక్ష తగదు
వేలూరు: కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖకు నిధులు కేటాయింపునకు నిబంధనలు పెట్టడాన్ని మానుకోవాలని లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని ఇండియన్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ప్రతినిధి జనార్దనన్ అన్నారు. వేలూరులో ఆ సంఘం సభ్యుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానాన్ని అమోదించే వరకు ఇంటి గ్రేటెడ్ పాఠశాలకు నిధులను కేటాయించలేమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రకటించడం సరికాదన్నారు. అనంతరం కేంద్ర మంత్రి ప్రకటనలు వెంటనే రద్దు చేయాలని, కేంద్ర మంత్రి తన నోటిఫికేషన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని, వివక్ష లేకుండా విద్యా రంగానికి నిధులు కేటాయించాలని, రాష్ట్రాల స్వతంత్ర విద్యా విధానాన్ని ప్రొత్సహించడానికి విద్యను రాష్ట్ర జాబితాకు బదిలీ చేయడం వంటి నిర్ణయాలను మానుకోవాలని కోరుతూ తీర్మానం చేశారు. ఈ తీర్మాణాలను కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో తమిళనాడు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ కూటమి జిల్లా కార్యదర్శి జోసెఫ్ అన్నయ్య, తమిళనాడు పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు జయకుమార్, సెకండరీ పాఠశాల అసోషియేషన్ జిల్లా అద్యక్షులు సెల్వకుమార్, కార్యదర్శి గుణశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment