శ్రీవైకుంఠం ఊళ్లోకి రాని బస్సులు
● రూ. 60 వేలు జరిమానా విధించిన కలెక్టర్
సేలం : తిరుచెందూర్‌తోపాటు అన్ని ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు శ్రీవైకుంఠంకు ఊరిలోకు రాకుండా ప్రయాణికులను బయట ఉన్న పుదుకడై మెయిన్ రోడ్డుపై దింపి వెళుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో బుధవారం శ్రీవైకుంఠం ప్రాంతంలో తూత్తుకుడి జిల్లా కలెక్టర్ ఇలం భగవత్ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. అప్పుడు శ్రీవైకుంఠం ప్రాంతానికి చెందిన ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు ఊళ్లోకి రావడం లేదని, ఊరి బయటే దింపి వెళుతుండడం వల్ల తాము ఊళ్లోకి కిలో మీటర్ దూరం రావాల్సి వస్తోందని ప్రయాణికులు కలెక్టర్ వద్ద వాపోయారు. కలెక్టర్ విచారణలో ఐదు ప్రభుత్వ బస్సులు, ఒక ప్రైవేటు బస్సు ఈ విధంగా ఊళ్లోకి రాకుండానే వెళుతున్నట్టు తెలిసింది. దీంతో ఒక్కో బస్సుకు రూ. 10 వేలు వంతున ఆరు బస్సులకు మొత్తం రూ. 60 వేలు జరిమానా విధించారు. ఇక ముందు కూడా ఏ బస్సు అయినా ఊళ్లోకి వచ్చి వెళ్లాలని లేకుండా జరిమానాను పెంచుతామని కలెక్టర్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment