ప్రగతి లక్ష్యంగా ట్రావెల్ ఫెయిర్
సాక్షి,చైన్నె: తమిళనాడులో పర్యాటక శాఖ తొలిసారిగా పర్యాటక ప్రగతిని కాంక్షిస్తూ తమిళనాడు ట్రావెల్ ఫెయిర్‌ను చైన్నెలో ఏర్పాటు చేసింది. నందంబాక్కం వర్తక కేంద్రంలో ఈ ఫెయిర్‌ను పర్యాటక మంత్రి ఆర్. రాజేంద్రన్ శుక్రవారం ప్రారంభించారు. మూడు రోజులపాటు ఈ వేడుక జరగనుంది. 22వ తేదీ మధ్యాహ్నం నుంచి ప్రజలు ఫెయిర్ సందర్శనకు అనుమతించనున్నారు. రాష్ట్రంలోని గొప్ప, విభిన్నమైన పర్యాటక అవకాశాలను ప్రదర్శించడానికి , పరిశ్రమ సహకారాన్ని పెంపొందించడానికి, పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి ఒక ప్రధాన వేదికగా దీనిని తీర్చిదిద్దారు. తమిళనాడు ట్రావెల్ ఫెయిర్ వేదిక, ట్రావెల్ ఫెయిర్‌ను ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్ సంస్థ ద్వారా నిర్వహించారు. తెలంగాణ, ఉత్తరాఖండ్ , తమిళనాడు, నేపాల్, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, జార్ఖండ్, కేరళ, పంజాబ్ టూరిజం వంటి రాష్ట్రాల ప్రభుత్వ పర్యాటక విభాగాలు కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యాయి. తమిళనాడు ప్రభుత్వం స్థిరమైన, బాధ్యతాయుతమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి, ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి, రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడానికి ఈ వేదిక ద్వారా గణనీయమైన చర్యలు తీసుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం పర్యాటక శాఖ కార్యదర్శి డాక్టర్ కె.మణివాసన్, కమిషనర్ శిల్పా ప్రభాకర్ సతీష్, పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రాంతీయ డైరెక్టర్ (దక్షిణ) డి.వెంకటేశన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment