పోలీస్ స్టేషన్ ముట్టడి
వేలూరు: కళాశాలలో మ హిళా ఫ్రొఫెసర్‌ను లైంగి కంగా వేధించిన వైస్ ప్రిన్సిపల్‌ను వెంటనే అరెస్టు చే యాలని కోరుతూ విద్యార్థు లు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించి, ధర్నా చేశారు. వే లూరు అన్నారోడ్డులోని ఊ రీస్ కళాశాలలో చిత్తూరు జి ల్లా గుడిపాల మండలం రాసనపల్లెకు చెందిన అన్బయగన్ వైస్ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. ఇతను అదే కళాశాలలో పనిచేస్తున్న మహిళా ప్రొఫెసర్‌ను లైంగికంగా వేధిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో ఆ మహిళా ప్రొఫెసర్ ఐదు రోజుల కిందట వేలూరులోని మహి ళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసు కున్న వైస్ ప్రిన్సిపల్ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసుకుని ఎ వరికీ కనిపించకుండా తల దాచుకున్నాడు. ఇదిలా ఉండగా ఫిర్యాదు చేసి ఐదు రోజులవుతున్నా పోలీసు లు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహించిన కళాశాల విద్యార్థులు సుమారు 500 మందికి పైగా కళాశాల ముఖ ద్వారాన్ని ముట్టడించి, ధర్నా నిర్వహించారు. విషయం తెలుసకున్న కళాశాల సిబ్బంది కళాశాలకు వచ్చే రెండు గేట్లకు తాళం వేశారు. ఆ గ్రహించిన విద్యార్థులు గేట్లును ధ్వంసం చేసి, వైస్ ప్రిన్సిపల్‌ను అరెస్ట్ చేయాలని కోరుతూ ర్యాలీగా మహిళా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని స్టేషన్‌ను ముట్టడించారు. విషయం తెలుసుకున్న అదనపు ఎస్పీ భాస్కరన్, డీఎస్పీ చంద్రదశరథన్, పోలీస్ ఇన్‌స్పెక్టర్లులత, శ్రీనివాసన్, పోలీసులు స్టేషన్ వద్దకు చేరుకుని, విద్యార్థులతో చర్చలు జరిపి కళాశాలకు పంపి వేశారు.
పోలీస్ స్టేషన్ ముట్టడి
Comments
Please login to add a commentAdd a comment