గంజాయి కేసులో యువతి అరెస్టు
అన్నానగర్: ఇన్‌స్ట్రాగామ్ ద్వారా టీనేజర్లకు వల వేసి, వారిని గంజాయి వ్యాపారులుగా మార్చిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువతిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. చైన్నె పల్లవరం సమీపంలోని త్రిసూ లం రైల్వేగేటు వద్ద పల్లవరం పోలీసులు గురువారం రాత్రి నిఘా పెట్టారు. ఓ యువతి చేతిలో పెద్ద బ్యాగ్ తో ఆ ప్రాంతంలో తిరుగుతోంది. దీంతో అనుమానించిన పోలీసులు యువతిని ఆపి, బ్యాగ్‌ను పరిశీలించారు. అందులో 3 కిలోల గంజాయి ఉండగా గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. ఆ యువతిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసులు షాక్‌కు గుర య్యే విషయాలు వెలుగులోకి వచ్చాయి. త్రిపురలోని ఉదయ్‌పూర్‌కు చెందిన యువతి పాయల్‌దాస్( 25) విలాసవంత జీవనానికి అలవాటుపడింది. ఈ క్రమంలో చైన్నెలో గంజాయి విక్రయించాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం త్రిపుర నుంచి గంజాయిని కొనుగోలు చేసి చైన్నెకి తీసుకొచ్చి విక్రయించింది. ఒంటరిగా అమ్మలేనని గ్రహించిన పా యల్ దాస్ తన పేరుతో ఇన్ స్ట్రాగామ్ పేజీని ప్రారంభించి తన సెక్సీ ఫొటోలను పోస్ట్ చేస్తూ.. తాను పెళ్లి కాని యువతినని, కాలేజీలో చదువుతున్నానని పోస్ట్ చేసి, పరిచయం పెంచుకుని గంజాయిని విక్రయించడానికి వారిని ఉపయోగించుకుంది. ఇలా మూడేళ్లుగా గంజా యి విక్రయిస్తున్న పాయల్‌దాస్ ఒక్కసారి కూడా పోలీసులకు దొరక్కపోవడం గమనార్హం. పోలీసులు ఆమైపె కేసు నమోదు చేసి తాంబరం కోర్టులో హాజరుపరిచి పుళల్ జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment