
తిరుత్తణి హుండీ ఆదాయం రూ.1.40 కోట్లు
తిరుత్తణి: తిరుత్తణి ఆలయంలో 27 రోజుల్లో భక్తులు హుండీల ద్వారా రూ.1.40 కోట్లు కానుకలుగా సమర్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు విచ్చేసి ఆలయ హుండీల్లో కానుకలుగా నగలు, నగదు, వస్తువులు చెల్లిస్తుంటారు. ఈక్రమంలో చివరి 27 రోజుల్లో భక్తులు చెల్లించిన కానుకలను ఆలయ జాయింట్ కమిషనర్ రమణి సమక్షంలో హుండీలోని కానుకలను వసంత మండపంలో బుధవారం లెక్కించారు. లెక్కింపులో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. భక్తులు రూ.కోటి 40 లక్షల 13 వేలు, 632 గ్రాముల బంగారం, 13,434 గ్రాముల వెండి భక్తులు కానుకగా చెల్లించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.