సాక్షి, కరీంనగర్‌టౌన్/మంచిర్యాల అర్బన్: ఉపాధ్యాయ వర్గాలు.. విద్యార్థుల తల్లిదండ్రుల్లో కరోనా టెన్షన్ మొదలైంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 14 మందికి కరోనా సోకింది. సోమవారం నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో 11 మంది ఉపాధ్యాయులు, ఇద్దరు వంట నిర్వా హకులు, ఓ విద్యార్థికి పాజిటివ్‌గా నమోదైంది. మూడు రోజుల కిందట పాఠశాలలోని ఓ ఉపాధ్యాయురాలు కరోనా బారిన పడటంతో సోమ వారం ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులకు వైద్య పరీక్షలు జరిపారు. పాఠశాలలోని 33 మంది ఉపా ధ్యాయులు, ఇద్దరు వంట నిర్వాహ కులు, 20 మంది విద్యార్థులకు పరీక్షలు చేయగా.. వారిలో 11 మంది ఉపాధ్యాయులు, ఇద్దరు వంట నిర్వా హకులు, ఓ విద్యార్థికి పాజిటివ్‌గా తేలింది. ఉపాధ్యాయులు, విద్యా ర్థులకు ఎలాంటి లక్షణాలు లేవు. డీఈవో వెంకటేశ్వర్లు హుటాహుటిన పాఠశాలను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంగళవారం మరికొంత మంది ఉపాధ్యాయులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రధానోపాధ్యాయురాలు శారద తెలిపారు.
కరీంనగర్‌లో నలుగురికి..
కరీంనగర్‌లోని రెండు పాఠశాలల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. కరీంనగర్‌లోని సుభాష్‌నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడికి నాలుగైదు రోజులుగా జ్వరం ఉండటంతో పాఠశాలకు సెలవుపెట్టి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నాడు. ఆయనకు పాజిటివ్‌గా తేలింది. సప్తగిరికాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఆయన భార్యకు కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో సోమవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి సుభాష్‌నగర్ పాఠశాలలో ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో మరో ఉపాధ్యాయుడికి, ఒక విద్యార్థికి కరోనా పాజిటివ్‌గా తేలింది.
Comments
Please login to add a commentAdd a comment