సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,100కు చేరుకుంది. అయితే దేశ సగటుతో పోలిస్తే తెలంగాణలో కరోనా మరణాల సంఖ్య తక్కువగానే ఉందని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు ఆదివారం కరోనా బులెటిన్‌లో తెలిపారు. కరోనా మరణాల జాతీయ సగటు రేటు 1.57 శాతముంటే, తెలంగాణలో అది 0.59 శాతంగా ఉంది. ఇక శనివారం వరకు రాష్ట్రంలో 28,50,869 మందికి కరోనా టెస్టులు చేయగా, అందులో 1,85,833 మంది కరోనా సోకినట్లు తేలింది. శనివారం ఒక్కరోజే 50,108 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 1,967 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు బయటపడింది.
ఇక తాజాగా 2,058 మంది కోలుకోగా, ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 1,54,499కి చేరింది. అలాగే మరో 9 మంది మృత్యువాత పడగా.. మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,100కు చేరింది. ప్రస్తుతం 30,234 కరోనా యాక్టివ్ కేసులుండగా, అందులో 24,607 మంది ఇళ్లు లేదా ఇతరత్రా సంస్థల ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఇక రాష్ట్రంలో ప్రతీ 10 లక్షల మంది జనాభాలో 76,788 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. ఇక తాజా కరోనా కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 297, కరీంనగర్ జిల్లాలో 152, రంగారెడ్డి జిల్లాలో 147, మేడ్చల్ జిల్లాలో 137, నల్లగొండ జిల్లాలో 105 ఉన్నట్లు బులెటిన్‌లో వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment