సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గడచిన 24 గంటల్లో కొత్తగా 3,821 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 23 మంది మృతి చెందగా, ఇప్పటివరకు 3,169 మంది కరోనాతో మరణించారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 4,298 మంది డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 5,18,266 మంది డిశ్చార్జ్ అయ్యారు.
తెలంగాణలో ప్రస్తుతం 38,706 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 537 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఖమ్మం 245, రంగారెడ్డి 226, మేడ్చల్‌లో 215, సూర్యాపేటలో 214, నల్గొండ 187, కరీంనగర్ 172, పెద్దపల్లి 147, వరంగల్ అర్బన్‌లో 146, మహబూబ్‌నగర్ 128, నగర్ కర్నూల్ జిల్లాల్లో 132, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాల్లో 116 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి.
చదవండి: కోవిడ్ తర్వాత.. కొలువులకు వాత?
Corona Vaccine: తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment