
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1556 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,06,436కు పెరిగింది. కరోనాతో ఒక్కరోజు వ్యవధిలో 14 మరణాలు చోటుచేసుకోగా.. మొత్తం మరణాల సంఖ్య 3510గా ఉంది. ఇక కరోనా నుంచి కొత్తగా 2070 మంది కోలుకోగా.. మొత్తం డిశ్చార్జి అయినవారి సంఖ్య 5,82,993గా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 19,933 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 1,20,043 కరోనా సాంపిల్స్‌ను పరీక్షించామని.. మొత్తంగా ఇప్పటివరకు 1,69,54,634 నమూనాలను పరీక్షించినట్లు అధికారులు పేర్కొన్నారు.
చదవండి: ఏపీలో కొత్తగా 5741 కరోనా కేసులు.. 53 మరణాలు