సాక్షి,హైదరాబాద్ : సమాజంలో గుర్తింపు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ట్రాన్స్‌జెండర్ల జీవితాల్లో వెలుగు నింపనుంది. గోషమహల్ స్టేడియంలో శిక్షణ పూర్తి చేసిన 44 మంది ట్రాన్స్ జెండర్లు సీఎం రేవంత్‌రెడ్డి చేతులు మీదిగా నియామక పత్రాలను అందుకోనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్ జెండర్లను ఎంపిక చేసింది. సోషల్ వెల్ఫేర్ శాఖ ఇచ్చిన అభ్యర్థుల జాబితా ప్రకారం మొత్తం 58 మంది ట్రాన్స్‌జెండర్లకు బుధవారం ఫిజికల్ ఈవెంట్ నిర్వహించింది. అందులో 44 మంది ఎంపికైనట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ 44 మంది ట్రాన్స్‌జెండర్లకు సీఎం రేవంత్‌రెడ్డి మరికొద్ది సేపట్లో నియామక పత్రాలు అందించనున్నారు. అనంతరం, వారు ట్రాఫిక్ విభాగంలో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వర్తించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment