విమలక్క ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ‘బహుజన బతుకమ్మ’  | Bahujan Bathukamma Celebrations Likely To Start On Sept 24 In Telangana | Sakshi
Sakshi News home page

విమలక్క ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ‘బహుజన బతుకమ్మ’ 

Published Thu, Sep 15 2022 12:46 AM | Last Updated on Thu, Sep 15 2022 12:46 AM

Bahujan Bathukamma Celebrations Likely To Start On Sept 24 In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రజాగాయకురాలు అరుణోదయ విమలక్క ‘బహుజన బతుకమ్మ’వేడుకలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తారు. ‘బతుకమ్మ ఉత్సవమే కాదు.. ఉద్యమమంటూ చాటుదాం’అంటూ రాష్ట్రవ్యాప్తంగా ‘బహుజన బతుకమ్మ’ ఉత్సవాలను చేపడుతున్నారు. పదమూడేళ్లుగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు ఈ సంవత్సరం సెప్టెంబర్‌ 24న ప్రారంభమవుతాయి. ఉదయం 10 గంటలకు గన్‌పార్కులో అమరులకు నివాళి అర్పించి, సాయంత్రం 4 గంటలకు ఉస్మానియా యూనివర్సిటీలో బతుకమ్మ ఆడతారు. అక్టోబర్‌ 3న యాదాద్రి భువనగిరిలో ముగింపు ఉత్సవాలు చేస్తారు.  

బహుజన బతుకమ్మ షెడ్యూల్‌: 
సెప్టెంబర్‌ 24: ఉదయం 10 గంటలకు గన్‌పార్కు వద్ద నివాళి, సాయంత్రం 4 గంటలకు ఓయూ ఆర్ట్స్‌ కాలేజీ ప్రాంగణం నుంచి ప్రారంభం 
సెప్టెంబర్‌ 25: నారాయణపేట జిల్లా పాటేపల్లి–హకీంపేట్‌లో 
సెప్టెంబర్‌ 26: సూర్యాపేట జిల్లా ఇస్తాళ్లపురంలో 
సెప్టెంబర్‌ 27: జనగాం జిల్లా బతుకమ్మకుంటలో 
సెప్టెంబర్‌ 28: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాలలో 
సెప్టెంబర్‌ 29: సిద్దిపేట జిల్లా కాజీపురంలో 
సెప్టెంబర్‌ 30: యాదాద్రి భువనగిరి జిల్లా వెల్మజాల, గుండాలలో 
అక్టోబర్‌1: రాజన్న సిరిసిల్లజిల్లా వేములవాడలో 
అక్టోబర్‌ 2: హైదరాబాద్‌ జిల్లా మల్లాపూర్‌లో 
అక్టోబర్‌ 3: యాదాద్రి భువనగిరి జిల్లా పిల్లాయిపల్లిలో.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement