సాక్షి, కాళేశ్వరం: రాజకీయ ప్రయోజనాలకే కాంగ్రెస్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. అన్నారం బ్యారేజీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ను పడగొట్టాలంటే కాళేశ్వరం పడగొడితే సరిపోతుందని.. సీఎం రేవంత్ ఆలోచనలా కనిపిస్తుందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అసలు కేసీఆర్‌నే లేకుండా చేయాలని రేవంత్ కుట్ర చేస్తున్నాడు. కేసీఆర్‌ను ఆనవాళ్లు లేకుండా చేస్తామంటున్నారు. గతంలో ప్రగతి భవన్‌ను బాంబులతో పేలుస్తామంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను హరీష్‌రావు గుర్తు చేశారు.
‘‘మేడిగడ్డ వెళ్తాం అనగానే కాగ్ రిపోర్ట్.. పాలమూరు విజిట్ అంటూ వెళ్ళారు కాంగ్రెస్ నాయకులు. మేము ఈ పర్యటనకు రాగానే ఉత్తమ్ మీడియా సమావేశం పెట్టి మేడిగడ్డ రిపేర్ చేయిస్తాం అని చెప్పారు. అంటే పాక్షికంగా మనం విజయం సాధించాం. ఇన్ని రోజులు బీఆర్‌ఎస్‌పై కుట్రలు చేసింది కాంగ్రెస్. రైతుల పక్షాన పని చేయాలని లేదు. ఎంత సేపు మా మీద ఆరోపణలే ఎక్కువ. అసత్య ప్రచారం చేస్తూ పబ్బం గడుపుతోంది’’ అంటూ హరీష్ ధ్వజమెత్తారు.
మెగా ప్రాజెక్ట్ కట్టినప్పుడు చిన్న, చిన్న లోపాలు రావటం సహజం. మొత్తం కాళేశ్వరం కూలిపోయింది అని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. అన్నారంలో ఉన్న ఇబ్బందులు వెంటనే మరమ్మతులు చేయాలి. వీటితో వచ్చే ఎండాకాలంలో నీరు అందించవచ్చు. కాపర్ డ్యాం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అబద్ధాలు బాగా నేర్చుకున్నాడు. తమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేవని కేంద్రం సీడబ్ల్యూసీ చెప్పింది. అక్కడ ప్రాజెక్ట్ కట్టాలని ఇప్పుడు చెప్తున్నాడు. ఉత్తమ్.. రేవంత్ రెడ్డిలాగా అబద్ధాలు మాట్లాడకు’’ అంటూ హరీష్‌రావు హితవు పలికారు.
కాగా, మేడిగడ్డ దగ్గర ఉద్రికత్త నెలకొంది. మేడిగడ్డకు చేరుకున్న బీఆర్‌ఎస్ నేతలు.. మెయిన్ గేట్ తోసుకుని వెళ్లారు. అసలు నిజాలను ప్రజల ముందు పెడతామని కేటీఆర్ అంటున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రతినిధులు సహా సుమారు 200 మంది ప్రతినిధి బృందంతో బ్యారేజీని సందర్శించారు.
తొలిసారి కేటీఆర్ రాక..
2016 మే 2న కాళేశ్వరం ప్రాజెక్టుకు అప్పటి సీఎం కేసీఆర్ భూమిపూజ చేసి పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి మంత్రి హరీశ్‌రావు పదుల సార్లు వచ్చి పనులను పరిశీలించారు. కానీ కేటీఆర్ రాలేదు. ప్రస్తుతం బ్యారేజీపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో తొలిసారిగా కేటీఆర్ బ్యారేజీ వద్దకు వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment