
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ బృందం ఆదివారం సుదీర్ఘంగా ప్రశ్నించింది. ఈ సందర్భంగా లిక్కర్ స్కామ్‌లో సౌత్‌గ్రూప్‌గా పేర్కొంటున్న వారితో ఏమైనా పరిచయం ఉందా? ఎప్పుడైనా కలిశారా? ఇటీవల ఫోన్లు ఎందుకు మార్చాల్సి వచి్చంది? వంటి అంశాలపై ఆరా తీసినట్టు తెలిసింది.
ఆదివారం ఉదయం 10.50 గంటలకే కవిత నివాసానికి చేరుకున్న సీబీఐ అధికారులు.. ఆమె వ్యక్తిగత కార్యాలయంలో సాయంత్రం 6.30 వరకు విచారించారు. మధ్యలో మధ్యాహ్నం 1.30 నుంచి సుమారు 45 నిమిషాల పాటు భోజన విరామం తీసుకున్నారు. మొత్తంగా సుమారు ఏడున్నర గంటల పాటు సీబీఐ బృందం కవిత నివాసంలోనే ఉంది. ఈ కేసులో నిందితుడైన అమిత్ అరోరా గతంలో ఇచి్చన వాంగ్మూలం ఆధారంగా.. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి కీలక ప్రశ్నలను సంధించి, ఆమె చెప్పిన సమాధానాలను నమోదు చేసుకున్నట్టు తెలిసింది.
ఈడీ రిమాండ్ రిపోర్టు ఆధారంగా..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు నిందితుడు అమిత్ అరోరాను రిమాండ్ చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోర్టుకు సమరి్పంచిన రిపోర్టులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ప్రస్తావించిన విషయం తెలిసిందే. స్కామ్‌లో కీలకమైన సౌత్‌గ్రూప్‌ను నియంత్రిస్తున్నవారిలో కవిత కూడా ఉన్నారని అమిత్ అరోరా చెప్పినట్టుగా ఈడీ పేర్కొంది. నిజానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఎఫ్‌ఐఆర్‌లో కవిత పేరు లేకున్నా.. ఈడీ రిమాండ్ రిపోర్టు, అమిత్ అరోరా స్టేట్‌మెంట్ ఆధారంగా ఆమెను ప్రశ్నించాలని సీబీఐ నిర్ణయించింది. ఈ మేరకు
160 సీఆరీ్పసీ కింద కవితకు ఈ నెల 2న నోటీసులు జారీ చేసింది. కవిత సూచనల మేరకు ఆదివారం (11న) ఉదయం విచారణ చేపట్టింది.
సౌత్ గ్రూప్‌కు సంబంధించి కీలక ప్రశ్నలు!
ఆదివారం ఉదయం 11 గంటలకు కవిత నివాసంలో విచారణ ప్రారంభం కావాల్సి ఉండగా.. పది నిమిషాల ముందు 10.50 గంటలకు సీబీఐ అధికారులు రెండు వాహనాల్లో అక్కడికి చేరుకున్నారు. డీఐజీ స్థాయి అధికారి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందంలో ఓ మహిళా అధికారి కూడా ఉన్నారు. అప్పటికే కవిత నివాసానికి ఆమె తరఫు న్యాయ సలహాదారులు చేరుకున్నారు. అధికారులు వారి సమక్షంలోనే కవితను ప్రశ్నించారు. సీబీఐ ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సౌత్ గ్రూప్‌గా పేర్కొంటున్న వారితో ఏదైనా పరిచయం ఉందా? అనే కోణంలో కవితను ఆరా తీసినట్టు సమాచారం.
‘‘కేసు నిందితులైన అమిత్ అరోరా, ఇతరులను ఎప్పుడైనా కలిశారా? వారితో ఫోన్ సంభాషణలు జరిగాయా? వారితో ఢిల్లీలో ఎప్పుడైనా సమావేశం అయ్యారా? ఫోన్లు ఎందుకు మార్చాల్సి వచి్చంది?’’ వంటి అంశాలపై వివిధ కోణాల్లో ప్రశ్నించినట్టు తెలిసింది. అయితే ఈ కేసు ఫిర్యాదులోగానీ, సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లోగానీ తన పేరు లేని విషయాన్ని విచారణ సందర్భంగా కవిత మరోమారు గుర్తు చేసినట్టు తెలిసింది. ప్రస్తుతానికి విచారణ ముగిసినా. అవసరమైన పక్షంలో మరోమారు విచారణకు అందుబాటులో ఉండాలని సీబీఐ ఆమెను కోరింది. ఈ మేరకు సీఆరీ్పసీ సెక్షన్ 91 కింద మరో నోటీసును అందజేసింది. ఏ రోజున విచారించేదీ త్వరలో నిర్ణయించి చెప్తామని తెలిపింది. విచారణ సందర్భంగా కవిత పేర్కొన్న పలు అంశాలకు సంబంధించిన పత్రాలను సమర్పించాలని కోరేందుకు ఈ నోటీసు జారీ చేసినట్టు సమాచారం. విచారణకు తాను పూర్తిస్థాయిలో సహకరిస్తానని కవిత చెప్పినట్టు తెలిసింది.
విచారణ అనంతరం ప్రగతిభవన్‌కు..
సీబీఐ బృందం విచారణ ముగిసిన తర్వాత రాత్రి 8 గంటలకు కవిత తన నివాసం నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. సీబీఐ బృందం విచారణ తీరుతెన్నులను ఆమె ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించినట్టు తెలిసింది. సీబీఐ విచారణకు సంబంధించి ప్రకటన విడుదల చేయాలని కవిత భావించారని.. కానీ సీబీఐ తదుపరి చర్యలపై స్పష్టత వచ్చాకే స్పందించాలని కేసీఆర్ సూచించడంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నారని సమాచారం.
నివాస పరిసరాల్లో పటిష్ట బందోబస్తు
ఎమ్మెల్సీ కవిత నివాసానికి సీబీఐ బృందం రాక నేపథ్యంలో పోలీసులు ఉదయం నుంచే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కవిత నివాసానికి వెళ్లే మార్గాన్ని రెండు వైపులా బారికేడ్లతో మూసివేశారు. సీబీఐ బృందం కవిత నివాసం నుంచి బయటికి వచ్చేంత వరకు ఇతరులెవరినీ అనుమతించలేదు. ఆదివారం ఉదయం ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, చంటి క్రాంతి కిరణ్, గొర్రెలు–మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్, బ్రూవరీస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్, దాసోజు శ్రవణ్, దేవీప్రసాద్‌రావు తదితరులు కవిత నివాస పరిసరాల్లో మీడియాతో మాట్లాడారు. సీబీఐ విచారణ ముగిసిన తర్వాత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తోపాటు పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కవిత నివాసం వద్దకు తరలివచ్చారు. కవితకు సంఘీభావం పలుకుతూ నినాదాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment