![Kalvakuntla Kavitha On CBI - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/5/KAVITHA.jpg.webp?itok=DqZdzcH_)
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం పాలసీ విషయంలో తాను కోరిన డాక్యుమెంట్లు సీబీఐ నుంచి అందిన తర్వాతే సంస్థ అధికారులను కలిసే తేదీని ఖరారు చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిర్ణయించుకున్నారు. సీబీఐ నోటీసులు, ఇతర పరిణామాలపై శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సుదీర్ఘంగా భేటీ అయిన కవిత.. ఆదివారం మరోమారు సీఎంను కలిశారు.
సీబీఐ నుంచి కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అంది, న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే తేదీపై ఒక నిర్ణయానికి రావాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. కాగా కవిత రాసిన లేఖకు ఆదివారం రాత్రి వరకు సీబీఐ నుంచి ఎలాంటి తిరుగు సమాధానం రాలేదని టీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. కేసీఆర్‌తో భేటీ తర్వాత కవిత.. ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment