ఫైల్ ఫోటో
సాక్షి, హైదరాబాద్: చర్ల ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ జరిపించాలని తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం అటవీ ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో చనిపోయిన ముగ్గురు మృత దేహాలను ఫ్రీజ్ చేయాలని పిటీషనర్ హైకోర్టును కోరారు. ఎన్ కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయాలని తెలిపారు. మృతదేహాలను వరంగల్ ఎంజీఎం, ఉస్మానియా ఆసుపత్రికి తరలించాలన్నారు. అదే విధంగా మృత దేహాలకు ఫోరెన్సిక్ నిపుణులతో పోస్టు మార్టం చేపించాలని హైకోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు విచారించ చేపట్టనున్నది. చదవండి: ముగ్గురు మావోల ఎన్‌కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment