
సాక్షి, హైదరాబాద్: బిహార్ నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా ఉత్తర తెలంగాణ వరకు ఏర్పడిన ఉత్తర–దక్షిణ ఉపరితల ద్రోణి శనివారం బలహీన పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రానికి తూర్పు, ఈశాన్య దిశల నుంచి తక్కువ ఎత్తులో బలంగా గాలులు వీస్తున్నట్టు వివరించింది. ఉపరితల ద్రోణి బలహీనపడిన ప్పటికీ రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది.
సాధారణంగా నమోదయ్యే ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీ సెల్సియస్ మేర తగ్గుదల నమోదు కావొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో చలి తీవ్రత పెరుగుతుందని సూచించింది. శనివారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 8.2 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత భద్రాచలంలో 32.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment