సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. సోమవారం 42,485 మంది నమూనాలను పరీక్షించగా, అందులో 253 మందికి పాజిటివ్ వచ్చినట్లు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు వెల్లడించారు. ఈమేరకు మంగళవారం ఉదయం ఆయన కరోనా బులెటిన్ విడుదలచేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 70,61,049 మందికి కరోనా పరీక్షలు చేయగా, అందులో 2,87,993 మందికి కరోనా సోకిందని తెలిపారు. ఇక సోమవారం 317 మంది కోలుకోగా, ఇప్పటివరకు 2,81,400 మంది కోలుకున్నట్లు పేర్కొన్నారు.
ఇప్పటివరకు 2.87 లక్షల మందికి వైరస్
ఒకరోజులో ముగ్గురు చనిపోగా, ఇప్పటివరకు కరోనాతో 1,554 మంది మరణించారన్నారు. కాగా, రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 97.71 శాతం ఉండగా, కరోనా మరణాల రేటు 0.53 శాతంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసులు 5,039 ఉన్నాయని, అందులో ఇళ్లు, కోవిడ్ కేర్ సెంటర్ల ఐసోలేషన్‌లో 2,793 మంది ఉన్నారని శ్రీనివాసరావు వెల్లడించారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో లక్షణాలు లేకుండా కరోనా బారినపడినవారు 2,01,595 (70%) కాగా, లక్షణాలతో వైరస్ సోకినవారు 86,398 (30%) మంది ఉన్నట్లు ఆయన తెలిపారు.
ఏపీలో 377 కరోనా కేసులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 51,420 కరోనా టెస్టులు చేయగా 377 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఒకే రోజు నలుగురు కోవిడ్‌తో మృతి చెందగా 278 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 1,20,53,914 టెస్టులు చేయగా, 8,83,587 మందికి కరోనా సోకింది. వీరిలో 8,73,427 మంది కోలుకోగా..3,038 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కరోనాతో 7,122 మంది మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment