
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1921 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శుక్రవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 22,046 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1921 మందికి కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడ్డవారి సంఖ్య88,396కు చేరింది. తాజాగా కరోనాతో 9మంది మృతి చెందగా.. మరణాల సంఖ్య 674కు పెరిగింది.
కరోనా నుంచి కొత్తగా 1210 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు 64,284 మంది పూర్తిగా కోలుకున్నారు.. ప్రస్తుతం రాష్ట్రంలో 23, 438 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు 7,11,196 కరోనా పరీక్షల నిర్వహించారు. కేసుల విషయానికి వస్తే.. గ్రేటర్ హైదరాబాద్ లో 356, మేడ్చల్ 168, రంగారెడ్డి 134 కరోనా కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment