
చేగుంట, వెల్దుర్తి (తూప్రాన్): ధరణి పోర్టల్‌లో లోపాలతో పేద రైతులకు అన్యా యం జరుగుతోందని మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ అన్నారు. రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో మీనాక్షి నటరాజన్ చేపట్టిన సర్వోదయ సంకల్ప యాత్ర సోమవారం మెదక్ జిల్లా మాసాయిపేట, చేగుంట, నార్సింగి మండలాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్‌లో అసైన్డ్ భూముల్లో కాస్తులో ఉన్న పేద, సన్నకారు రైతుల పేర్లు కనిపించడం లేదన్నారు. ప్రస్తుతం నిధుల సేకరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వందలాది ఎకరాల సర్కారు భూములను అమ్మడానికి ప్రయత్నించడం దారుణమన్నారు. గ్రామాల్లోని పేద రైతులు వ్యవసాయం చేసి ఆర్థికంగా ఎదుగుదల సాధించడమే సర్వోదయ సంకల్పమని తెలిపారు. కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతుల పక్షాన నిరంతర పోరాటం చేస్తామని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment